
ఈ ఆంగ్ల సంవత్సరంలో స్టాక్ మార్కెట్, బంగారం, వెండిలలో ఏది అత్యుత్తమ లాభాలు అందించిందో తెలుసా వెండి. అవును నిజమే వెండే బంగారమైంది. మదుపరులకు లాభాల పంట పండించింది. పెట్టిన పెట్టుబడిపై అరవైఐదు శాతం లాభాలు ఇచ్చింది. అదే సమయంలో బంగారం ఇరవైరెండున్నర శాతం, స్టాక్ మార్కెట్ పద్నాలుగున్నర శాతం ప్రటిఫలం ఇచ్చాయి. జనవరి ఒకటిన ఇరవైఏడు వేల నాలుగొందలు ఉన్న వెండి ధర డిసెంబర్ ఇరవైనాలుగో తేదీకి నలబై ఐదు వేల నాలుగొందలకు చేరింది. అదే కాలంలో బంగారం ధర పదహారువేల ఆరొందల డెబ్భై రూపాయలనుంచి ఇరవై వేల నాలుగొందల అరవై రూపాయలకు చేరింది. మొత్తంగా చుస్తే వెండి, బంగారంలో పెట్టుబడి బంగారు బాతు అని నిరూపించింది.
No comments:
Post a Comment