
వరదలు వచ్చాయి. జనాలను ముంచాయి. పంటలను నీటిపాలు చేసాయి. రైతులకు కన్నీళ్ళే మిగిల్చాయి. అండగా ఉంటామన్న సర్కారు సహాయ ప్యాకేజీలో రిక్త హస్తం చూపింది. శాసనసభ సమావేశాల్లో ప్రతిపక్షాల పోరాటం పాలకుల మేడలు వంచలేక పోయింది. రైతుకు న్యాయం చెయ్యాలంటూ చెంద్రబాబు ఆమరణ దీక్ష చేపట్టారు. తెలుగు తమ్ముళ్ళు రోడ్డెక్కారు. జాతీయ నాయకులూ రాష్ట్రానికోచ్చారు. అయినా సర్కారు దిగిరాలేదు. చివరకు బాబు ఏమీ సాదిన్చ్కుండానే దీక్ష విరమించారు. అప్పటికే డిసెంబర్ చివరికొచ్చింది. అంతే మళ్ళీ లొల్లి మొదలైంది. అదే తెలంగాణా లొల్లి. ఎందుకంటే శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్ ఇచే గడువు దగ్గర పడింది కాబట్టి. అందుకే పదహారో తెదేఎ గర్జన సభతో కదం తొక్కిన నేతలు ఇప్పుడు మాటలు పదును పెడుతున్నారు. కేసీఆర్ అయితే ప్రాణాలు అర్పించి అయినా ప్రేత్యక రాష్ట్రం సాధిస్తమంటున్నాడు. కొత్త సంవత్సరంలో ప్రేత్యేక యుద్దానికి కార్యకర్తలను, ప్రజలను సిద్దం చేస్తున్నారు. అదే సమయంలో ఎంపీ కావూరి సాంబశివరావు తెలంగాణకు, శ్రీకృష్ణ కమిటీకి వ్యతిరేకంగా గళం విప్పారు. వ్యంగ్యాస్త్రాలు సందిస్తున్నారు. తెలంగాణా కాంగ్రెస్ నేతలూ ప్రేత్యేక వాదానికి సై అంటున్నారు. కావురిపై నిప్పులు చెరుగుతున్నారు. కేసీఆర్ను బలపరచాలని, తెలంగాణా నేతలందరూ ఒకే గొడుగు కిందకు చేరదామని పెలుపు ఇస్తున్నారు. ఉద్యోగ సంఘాలు సహాయ నిరాకరణ చేస్తామని హెచ్చరిస్తున్నాయి. ఇటు తెలంగాణా, అటు సీమాంధ్ర ప్రజలు మాత్రం శ్రీకృష్ణ కమిటీ నేవిదిక ఏమి చేబుతుందోనని ఆందోళనగా ఎదురు చూస్తున్నారు.
No comments:
Post a Comment