
ఇప్పటి వరకు ఆహార పదార్ధాలను చల్లగా ఉంచే ఫ్రిజ్ ఇకపై తానే వంట చేస్తానంటోంది. వింతగా ఉన్న ఇది నిజామేనండి బాబూ. ఇది నీ మాటో, నా మాటో కాదు. లండన్ శాస్త్రవేత్తలు చెబుతున్న నిజం. ఫ్రిట్జ్ ఆఫ్ ద ప్యూచర్ అని పేరు కూడా పెట్టారు. త్వరలో వినియోగదారులు అందుబాటులోకి తెస్తామని కూడా చెబుతున్నారు. అసలు ఇది ఎలా పని చేస్తుందో తెలుసా... ఇది అరల్లో ఉన్న సరుకులను స్కానింగ్ ద్వారా గుర్తిస్తుంది. మనం కోరిన వంటకు అవసరమైన సరుకులు లేకపొతే సూపర్ మార్కెట్టుకు ఆర్డర్ ఇచ్చి తెప్పించుకుంటుంది. అంతేకాదు వంట చేయడానికి కొంత సమయం పడుతుంది అని కూడా చెబుతుంది. ఈ అధ్బుతమైన ఫ్రిట్జ్ నానో టెక్నాలజీతో తయారవుతోంది.