Saturday, March 5, 2011
ప్రణబ్జీ నిజమేనా
మేము సమస్యలను సృష్టించగలము , పరిష్కరించగలము అంటూ ఎంత బాగా చెప్పారు ప్రణబ్జీ. మరి ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం రేగిన చిచ్చు మీరు సృష్టించిన సమస్యే కదా. నెహ్రు, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీలే పరిష్కరించలేని సమస్యను రాత్రికి రాత్రే ఎలా పరిష్కరించగాలమని మీరు ఎంపీలను ప్రశ్నించారు. నిజమే కానీ ప్రస్తుత సమస్యను వాళ్ళు సృష్టించలేదు. మీరే సృష్టించారు. అదీ మీరు సాద్యం కాదంటున్న అదే అర్ధరాత్రి. తలగన ఏర్పాటు ప్రక్రియను ప్రరంభిస్తున్నామంటూ చిదంబరంతో ప్రకటన చేయించి మరీ సృష్టించారు. ఆ సమస్య ఇప్పుడు మా జీవితాల్లో కల్లోలం సృష్టిస్తోంది. అందుకే మేము మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు సృష్టించిన తెలంగాణా సమస్యకు మీరు వెంటనే పరిష్కారం చూపండి. అప్పడు మీ మాటలు నిజమని నమ్ముతాం.
రాష్ట్రము కంటే పదవులే ముద్దా
పదవులు త్యజిస్తామన్న తెలంగాణా ఎంపీల , ఎమ్మెల్యేల మాటలు కాకమ్మ కబుర్లేనా... శాసన సభ , పార్లమెంట్ సమావేశాలు త్వరగా అయిపోతే బాగుండునని వాళ్ళు కోరుకుంటున్నారా ... అందుకే అడిస్తానంపై ఒత్తిడి , చేర్చల పేరుతొ కాలం వెళ్ళబుచ్చుతున్నారా ... అంటే అవుననే అనిపిస్తోంది . వాళ్ళ మాటలు , చేతలు అందుకు అద్దం పడుతున్నాయి . ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాతే తెలంగాణా మీద ప్రకటన వెలువడుతుందని ఎంపీలే చెబుతుండడం , శుక్రవారం చేసిన ప్రకటనకు భిన్నంగా తాజాగా 12va తేదీ అధిష్టానాన్ని కలిసి రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతను వివరిస్తామని చెప్పడం , ఆ తర్వాత భవిష్యత్తు కార్యాచరణను ప్రక్తిస్తామనడం చూస్తుంటే వాళ్ళు పదవులు వదులుకోవడానికి సిద్దంగా లేరని స్పష్టమౌతోంది.
Friday, February 18, 2011
అసలు దోషులు ఎవరు
మళ్ళీ నిప్పు రాజుకుంది. తెలంగాణా ఆకాంక్ష ఉవ్వెత్తున ఎగిసిపడుతోంది. తెలంగాణా జేఏసీ గాంధీ మార్గమంటూ సహాయ నిరాకరణకు పిలుపునిచ్చింది. టిఆర్ఎస్ నేతలు టికెట్లు తీసుకోకుండా బసులు ఎక్కారు. శాసన సభలో అయితే ఇంకో అడుగు ముందు కేసారు. గాంధేయ మార్గాన్ని పక్కన పెట్టారు. ఆ పార్టీ శాసన సబ్యులు. అసెంబ్లీలో గవర్నెర్ ప్రసంగాన్ని అడ్డుకున్నారు. తెలుగుదేశం తెలంగాణా నెతలూ వాళ్లతో కలిసిపోయారు. తెలంగాణా సాధనే లక్ష్యంగా వీరంగం సృష్టించారు. శాసనసభ సమావేశాన్ని అడ్డుకున్నారు. వాళ్ళు వ్యవహరించిన తీరు బాధాకరమని మీడియా పాయింట్ వద్ద జేపీ కామెంట్ చేసారు. దానితో ఆగ్రహించిన టీఆర్ ఎస్ ఎమెల్యేలు ఆయనపై చేయి చేసుకున్నారు. ఆతర్వాత జరిగిన పరిణామాలతో ఉద్యమం వేడెక్కింది. మరోసారి ఉస్మానియా భగ్గుమంది. విద్యార్దులు రోడ్డెక్కారు. విద్వంసం సృష్టించారు. తెలంగాణాలోని పలు జిల్లాల్లో ఇదే పరిస్థితి పునరావృతం అయ్యే ప్రమాదం ఉంది. ఇదిలా ఉంటె ఇన్ని అనర్ధాలకు అసలు కారకులు ఎవరు. నిజమిన దోషులేవారు. గత డిసెంబర్లో చిదంబరం చేసిన ప్రకటన నుంచి కేంద్రం వెనకడుగు వెయ్యడమే ఇందుకు కారణం. శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్ ఇచిన తర్వాత కూడా ఎలాంటి నిర్ణయాన్ని ప్రకటించకుండా మీనా మేషాలు లెక్కిస్తున హస్తిన సర్కారే ఈ అనర్ధాలకు మూలం. తెలంగాణా ఇచ్చినా, తెచ్చినా మేమేనని చెప్పిన, చెబుతున్న ప్రతి కాంగ్రెస్ నేతా తెలంగాణా ప్రజా కోర్టులోని బోనులో దోషులే... వీరిలో ప్రధమ ముద్దాయి మాత్రం మేడం సోనియానే.
Thursday, February 17, 2011
Friday, January 28, 2011
Thursday, January 27, 2011
Subscribe to:
Posts (Atom)